Header Banner

కేంద్ర మంత్రి ట్వీట్ ను రీపోస్టు చేసిన ప్రధాని మోదీ! ఏపీలో యోగాంధ్ర 2025లో...

  Wed Jun 04, 2025 12:21        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములవుతున్నారు. యోగాంధ్రలో భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్ హిల్స్‌లో దాదాపు రెండు వేల మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరు యోగాసనాలు వేస్తున్న ఫోటోలను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ట్వీట్‌ను రీ-పోస్ట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో యోగా దినోత్సవంపై ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మోదీ సూచించారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

 వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NarendraModi #YogaAndhra2025 #AndhraPradesh #YogaDay #PratapRaoJadhav #Chittoor #PuligunduTwinHills #AyushMinistry